
దిన ఫలాలు (మార్చి 31, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఇంటి వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ ఏర్పడుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటా బయటా ప్రశాంత పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు అందుకుంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సహాయాన్ని కూడా తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. పిల్లలకు సంబంధించి శుభవార్త వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో అధికారులతో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు నిదానంగా చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాలలో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలున్నా ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవు తాయి. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థికంగా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు కొద్దిగా అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సహచరుల సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దలతో సానుకూలంగా, సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా సాగుతాయి. ఇష్టమైన మిత్రులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గు తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశముంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుటుంబ జీవితంలో కొన్ని చికాకులు తప్పవు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా పురోగమిస్తాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, కార్య క్రమాలు అమలు చేస్తారు. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించి ఆలోచనలు చేస్తారు. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో పెద్దల పరిచయాలు విస్తృతం అవుతాయి. పిల్లలకు చదువులకు సంబంధించి కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన శుభ వార్త వింటారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. వృథా ఖర్చులు తగ్గించుకోవాలి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసు కుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. తల్లితండ్రుల సహాయంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు. బంధువులు అపనిందలు వేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.