Reading Time: < 1 minute
Kaleshwaram Project Controversy Cr Patil Comments Rajya Sabha

తెలంగాణలోని ప్రతిష్టాత్మక కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే ప్రధాన కారణమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ స్పష్టం చేశారు. రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాలేశ్వరం నిర్మాణం, అందులో జరిగిన అవినీతి , సాంకేతిక లోపాలపై కేంద్రం ఘాటుగా స్పందించింది.

Donald Trump: ఇరాన్‌కు హై లెవల్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇక వినాశనమే..

కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసి నీళ్లలో పోశారని కేంద్రమంత్రి మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులోని లోపాలను కేంద్ర బృందం నిశితంగా అధ్యయనం చేస్తోందని మంత్రి వెల్లడించారు. అంతకుముందు, బీఆర్ఎస్ ఎంపీ కే.ఆర్. సురేష్ రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం, ప్రాజెక్టులోని లోపాలు , నిర్మాణ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు సంధించింది.

Wankhede Stadium Proposal: కేకేఆర్ జెర్సీ ధరించిన అమ్మాయికి ప్రపోజ్‌ చేసిన ముంబై అభిమాని.. స్టేడియంలో గందరగోళం..!

మరోవైపు, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. నిధులను నిర్దేశించిన పనులకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడంపై కేంద్రం సీరియస్ అయింది.