
అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో పాలు పంచుకొనే విమానాలను అనుమతించమని ఆ దేశ రక్షణ మంత్రి మార్గెరెటా రొబెల్స్ సోమవారం వెల్లడించారు. ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక స్థావరాలను పశ్చిమాసియా ఘర్షణల కోసం వినియోగించడాన్ని ఇప్పటికే స్పెయిన్ నిరాకరించింది.
‘‘ఇరాన్ యుద్ధానికి సంబంధించిన కార్యకలాపాల కోసం మిలిటరీ స్థావరాలు లేక గగనతలాన్ని వియోగించడానికి అనుమతి ఇవ్వబోం. ఏక పక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించకూడదని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే తాజా ప్రకటన వచ్చింది’’ అని రక్షణ, ఆర్థిక మంత్రులు స్థానిక మీడియాలో వెల్లడించారు.