Reading Time: 2 minutes

IPL 2026: వైభవ్ సిక్సర్ల హోరు.. చెన్నైపై రాజస్థాన్ ఘన విజయం

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గౌహతిలోని బర్సపరా మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు 8  వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్కే ఇచ్చిన 128 పరుగుల లక్ష్య ఛేదన కోసం రాజస్థాన్ బరిలోకి దిగింది. ఆర్ఆర్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరు కలిసి జస్ట్ పవర్ ప్లేలోనే మ్యాచుని రాజస్థాన్ వైపుకి తిప్పేశారు. 30 బంతుల్లోనే 75 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. ఇక చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్లు తీసేందుకు బౌలర్లను మార్చిన పెద్దగా ఫలితం మాత్రం దక్కలేదు. ఎట్టకేలకు అన్షుల్ కాంబోజ్ అద్భుతమైన బౌలింగ్ తో ఓపెనింగ్ జోడిని విడదీశాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 17 బంతుల్లో 52 రన్స్ చేసిన తర్వాత  అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ లో సర్ఫరాజ్ ఖాన్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు.  అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కాసేపు బ్యాట్ ఝలిపించిన తర్వాత అన్షుల్ కాబోజ్ బౌలింగ్లోనే క్లిన్ బౌల్డ్ అయ్యాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (14), యశస్వి జైస్వాల్ (38) మ్యాచ్ ని కంప్లీట్ చేసేశారు. కాగా ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు పలు క్యాచులని వదిలి పెట్టడం కూడా మైనస్ గా మారింది. అంతకుముందు చైన్న సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. కేవలం జెమీ ఓవర్టిన్ ఒక్కడే 43 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించగా, కార్తీక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ ఒక్కడే రెండు తీసుకోగా మిగతా బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.