
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్లు, కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు కనీసం శానిటరీ ప్యాడ్స్ అందించలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎక్స్ వేదికగా కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పీఎం శ్రీ పథకం కింద ఇతర స్కూళ్లలో ఇస్తున్నట్టే ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్లు, కెజిబివిల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతినెలా విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని ఆమె కోరారు.