
జగిత్యాల గ్రామీణ మండలం లక్ష్మీపూర్ లో కుటుంబ కలహాలతో ఆదరవేని సత్తవ్వ (50) అనే మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. గత కొద్దిరోజులుగా మనస్పర్ధలతో భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మల్లయ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో సత్తవ్వపై గోడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిందితుడు మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.