
హైదరాబాద్, ఏప్రిల్ 3: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి బోర్డు పరీక్షలు 2026 మార్చి 11తో ముగిసిన సంగతి తెలిసిందే. ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఏప్రిల్ నెల మధ్యలో సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే బోర్డు అధికారులు గానీ, పరీక్షల కంట్రోలర్ గానీ సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2026 ప్రకటించే తేదీ, సమయాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై సీబీఎస్సీ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.
సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షల 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా గతేడాది సీబీఎస్సీ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18న ముగిసినప్పటికీ మే 3న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఫలితాల విడుదల మే 13కి వాయిదా వేసింది. చివరకు మే 13న ఫలితాలు వెల్లడించారు. ఇక ఈ ఏడాది కూడా మార్చి 18నే బోర్డు పరీక్షలు ముగిశాయి. కానీ ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 27 మధ్య బోర్డు పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. మూల్యాంకన ప్రక్రియ కూడా వేగంగానే ప్రారంభమైంది. అనంతరం మోడరేషన్, వెరిఫికేషన్ దశలు కూడా ఉంటాయి. ఈ ప్రకారంగా చూస్తే ఫలితాలు విడుదల ఇంకాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం ఫలితాల ప్రకటన ఏప్రిల్ చివరి వారంలో ఉండే అవకాశం ఉంది. మొత్తంగా ఏప్రిల్ 27, 2026 నాటికి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్ 20, 2026 లేదా అంతకంటే ముందు వెల్లడించే అవకాశం ఉండబోదు. కాబట్టి CBSE 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 20 నుంచి 27 మధ్య ఉండే అవకావం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షల 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక సీబీఎస్సీ ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ లింక్‌లు cbse.gov.in లేదా results.cbse.nic.in వెబ్‌సైట్‌ల నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను డిజిలాకర్, అధికారిక వెబ్‌సైట్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.