Reading Time: < 1 minute

క్వేక్ అరీనా పబ్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు…

Caption of Image.

హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న క్వేక్ అరీనా పబ్ పై ఈగల్ టీం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ  తనిఖీల్లో నటి హేమకు నెగిటివ్ రాగా.. ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో క్వేక్ ఎరీనా పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి… గురువారం ( ఏప్రిల్ 3 ) క్వేక్ పబ్ లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్ సందర్భంగా ప్లాన్ చేసిన ప్రత్యేక పార్టీపై దాడి చేసినట్లు తెలిపారు పోలీసులు. ముందస్తు సమాచారం ఆధారంగా ఆరుగురు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టామని..డ్రగ్స్ వినియోగంపై అనుమానంతో 64 మందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలిపారు.

స్పాట్‌లో 8 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించామని.. అనుమానితులను ఏబాన్ యూరిన్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహించామని తెలిపారు పోలీసులు. వీరిలో 5 మందికి THC (గంజాయి) పాజిటివ్‌గా రాగా..ఒకరికి బెంజోడియాజెపైన్ పాజిటివ్, మరొకరికి AMP & మెతాంఫెటమైన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు పోలీసులు. మొత్తం 8 మంది డ్రగ్స్ వినియోగం చేసినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు పోలీసులు

నిందితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని.. NDPS చట్టం సెక్షన్ 8(c), 27(a), 27(b) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌పై సమాచారం సేకరిస్తున్నామని..డ్రగ్స్ వినియోగించిన వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామని తెలిపారు పోలీసులు. అవసరమైతే డీ-అడిక్షన్ ప్రోగ్రాంలకు పంపిస్తామని అన్నారు.

స్పెయిన్‌ కు చెందిన విదేశీ ఆర్టిస్ట్ అలెగ్జాండర్‌, క్వేక్ అరినా డీజే కేవీకి కూడా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు. డ్రగ్స్‌పై సమాచారం ఉంటే 1908 లేదా 8712671111కు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈగల్ టీం పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.