
ఉలెన్‌బాటర్: ఇండియా బాక్సర్ ఆదిత్య ప్రతాప్ యాదవ్.. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్ 65 కేజీల ప్రిక్వార్టర్స్‌లో ఆదిత్య 5–0తో మౌసా అల్హానా (సౌదీ అరేబియా)పై ఏకగ్రీవంగా నెగ్గాడు.
బౌట్ ఆరంభం నుంచే హుక్స్, అప్పర్ కట్స్‌తో విరుచుకుపడిన ఆదిత్య.. ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. సౌదీ బాక్సర్ కొట్టిన పంచ్‌లను దీటుగా అడ్డుకున్నాడు. క్వార్టర్స్‌లో ఆదిత్య.. అబ్దుల్లా మదామినోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు.