Reading Time: < 1 minute

 మహబూబ్ నగర్ ఖేల్ సంసద్ మహోత్సవ్ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపి డికె అరుణ ఆహ్వానించారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో శుక్రవారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే క్రీడా మహోత్సవం గురించి గవర్నర్‌కు వివరించారు. 24వ తేదీన మహబూబ్ నగ ర్ వేదికగా జరిగే ముగింపు వేడుకకు హాజరవుతానని గవర్నర్ సానుకూలంగా స్పందించారు.