Reading Time: < 1 minute

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్‌ను ఆగం చేసేలా ఉన్నారని కవిత విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి గురించి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. మద్యం కేసు కొట్టి వేశారంటేనే ప్రకృతి తమకు సహకరిస్తుందని అన్నారు. అదృష్టవంతులను ఎవరూ ఆపలేరని, తమ ఎజెండా ప్రకటించాక చాలా మంది పార్టీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో ఉన్నవారని, ఇతరులు పార్టీలో చేరుతామని అంటున్నారని పేర్కొన్నారు. పార్టీ తరపున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని, శ్రమనే నమ్ముకుని ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు. ఆరు గ్యారంటీల గురించి కేరళంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. మహారాష్ట్ర, బీహార్‌లో కూడా ఇలాగే చెప్పారని, కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించారని గుర్తు చేశారు.