Reading Time: < 1 minute

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేష్ థియేటర్ వద్ద అతి వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో వాహనంలో నలుగురు వ్యక్తులు ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.