
భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న దృశ్యకావ్యం ‘రామాయణ’. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. అయితే, ఈ టీజర్ రాగానే అందరికీ గుర్తొచ్చిన పేరు ‘ఆదిపురుష్’. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా విమర్శల పాలైన నేపథ్యంలో, ఇప్పుడు రణబీర్ రామాయణ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు రెండు సినిమాలను పోల్చి చూస్తున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా ఈ రెండు సినిమాల విషయంలో గ్రాఫిక్స్ మీద కంపారిజన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిపురుష్ సినిమాను దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా గ్రాఫిక్స్ విషయంలో మాత్రం చాలా విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్న రామాయణ టీమ్… విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అప్పటి కాలాన్ని గ్రాండ్‌గా ప్రజెంట్ చేస్తూనే… ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అయ్యే ప్రయత్నం చేసింది.
రాముడిగా ప్రభాస్ లుక్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. హెయిర్ స్టైల్, గడ్డం, కాస్ట్యూమ్స్ ఇలా ఏ ఒక్కటి, భారతీయల మదిలో ఉన్న రాముడిలా లేకపోవటంతో ఆ సినిమాను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే రణబీర్ లుక్‌ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసింది రామాయణ టీమ్. గతంలో వచ్చిన రామ కథల్లో రాముడి ఎలా ఉలా ఉంది. మన గ్రంథాల్లో మర్యాద పురుషోత్తముడిని ఎలా వర్ణించారు అన్న విషయాలను పరిగణలోకి తీసుకొని అందరికీ యాక్సెప్ట్ చేసేలా రణబీర్ లుక్‌ను డిజైన్ చేశారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ కపూర్ రాముడి పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. ముఖ్యంలో ప్రశాంతత, కళ్లో గాంభీర్యం, సిక్స్ ప్యాక్ ఫిజక్‌తో రాముడంటే ఇలాగే ఉంటాడా అనేలా కనిపించాడు.
ఆదిపురుష్ సినిమా మీద మరో మేజర్ కంప్లయింట్ పాత్రల చిత్రీకరణ. రావణుడి లుక్, ఆయన వాహనం, లంకా నగరం విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్వర్ణలంకను కేజీఎఫ్ లా చూపించారంటూ సెటైర్లు పడ్డాయి. అదే సమయంలో సీతమ్మ డ్రెస్సింగ్, హనుమంతుడి డైలాగ్స్ కూడా విమర్శల పాలయ్యాయి. రామాయణ తొలి టీజర్‌లో రాముడు తప్ప ఇతర క్యారెక్టర్ల మీద ఫోకస్ చేయకపోవటంతో మిగతా క్యారెక్టర్ల విషయంలో పూర్తి క్లారిటీ అయితే రాలేదు. కానీ లుక్స్ విషయంలో మాత్రం విమర్శలకు అవకాశం లేకుండానే జాగ్రత్త పడుతున్నారనిపిస్తోంది.
అయితే రణబీర్ రామాయణ టీజర్ విషయంలో అంతా పాజిటివ్‌గానే ఉందా..? అలా కూడా లేదు. ఈ సినిమా విషయంలోనూ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా యానిమల్ లాంటి బోల్డ్ సినిమా చేసిన తరువాత రణబీర్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అందుకే బాలీవుడ్‌లోనే కొంత మంది రణబీర్ రాముడి పాత్రకు సూట్ అవ్వలేదన్న విమర్శలు చేస్తున్నారు. ఆదిపురుష్ ప్రమోషన్స్ టైమ్‌లో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సినిమా తరువాతే అసలు వివాదాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు రామాయణ విషయంలోనూ అలా జరిగే అవకాశం ఉందన్న టెన్షన్ ఆడియన్స్‌లో కనిపిస్తోంది.
మన ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించే ప్రయత్నం ఆదిపురుష్ టీమ్ పూర్తిగా తడబడింది. ఇప్పుడు మరోసారి మనమేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం రామాయణతో వచ్చింది. దాదాపు 4000 కోట్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా వెండితెర మీద కొత్త చరిత్ర సృష్టిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కథ పరంగా రామాయణాన్ని మించిన కమర్షియలిటీ ఎక్కడా ఉండదు. ఇంత గొప్ప కథకు హాలీవుడ్ స్థాయి హంగులు కూడా కుదరటంతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మన రామకథకు మరింత వైభవాన్ని తీసుకువస్తుందని నమ్ముతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..