Reading Time: < 1 minute
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై  దాడి

జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్క పై దాడి జరిగింది. అభిమానులమంటూ.. నమ్మబలికిన ఓ 8 మంది కొమురక్క ఇంటికి వెళ్లి.. కావాలని గొడవ పెట్టుకుని మరీ అతడిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో కొమురక్కతో పాటు కొమురక్క గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తికి కూడా గాయలైనట్టు సమాచారం. ఈ ఘటన కొమురక్క స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం ఉడిత్యాలలో ఏప్రిల్ 1 రాత్రి జరిగింది. అయితే ఈ దాడి కొమురక్క అసిస్టెంట్ శ్రీనాథే చేయించాడని కొమురక్క ఆరోపిస్తున్నట్టుగా సమాచారం. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది కొమురక్క. ఈ క్రమంలోనే పోలీసులు కొమురక్క పై దాడి చేసిన ఎనిమిమందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో కొమురక్క ఇంట్లో నుంచి బంగారం చోరీ చేశాడు అతడి అసిస్టెంట్ శ్రీనాథ్‌. అప్పట్లో స్వయానా కొమురక్కే అతడి చోరీని కనిపెట్టి మందలిచింది. దొంగిలించిన బంగారాన్ని గడువులోపు తిరిగి ఇవ్వాలని వార్నింగ్‌ కూడా ఇచ్చింది. కానీ శ్రీనాథ్ తిరిగి ఇవ్వకపోగా.. తన ఫ్రెండ్స్‌తో కలిసి కొమురక్కపై దాడికి ప్లాన్ చేశాడు. అదును చూసి.. నిన్న రాత్రి కొమురక్కపై దాడి చేశాడు. ఎప్పటికైనా చంపుతామని బెదిరించాడు. స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా..అక్కడి నుంచి పారిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్

Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు

ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ

కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే

ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే