
సిద్దిపేట: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బలవంతంగా ప్రేమజంటను పెద్దలు విడదీయడంతో ప్రియుడు పురుగులు మందు తాగి చనిపోవడంతో ప్రియురాలు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముస్త్యాల గ్రామంలో అనుముల రాకేష్ రెడ్డి(25), తరిగొప్పుల హారిక(22) యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. రాకేష్ రెడ్డి ఇంట్లో ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్ లో నివసిస్తున్నారు. పెళ్లైన మూడు నెలలకు ప్రేమజంటను స్వగ్రామానికి తీసుకువచ్చారు. కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి రాకేష్ రెడ్డి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఇటీవల హారిక ఆత్మహత్యాయత్నం చేసుకోవగా రాకేష్ రెడ్డి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం పెళ్లి చేస్తామని చెప్పినా కూడా కావాలనే ఆలస్యం చేస్తున్నారని వీళ్లు పెళ్లి చేయరని మనస్తాపంతో పురుగుల మందు తాగి రాకేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణ వార్త విని తట్టుకోలేక హారిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.