
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ - పెద్దపల్లి బైపాస్ లోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.