Reading Time: < 1 minute

ఒటిటిలు అందుబాటులోకి వచ్చాక.. ప్రేక్షకులకు వినోదం మరింత చేరువైంది. థియేటర్ల వరకూ వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో నుంచి తమకు నచ్చిన సినిమాలను చూసే వీలు కలిగింది. అయితే సినిమాలతో పాటు ఒటిటిలు అంటే మనకు గుర్తొచ్చేది వెబ్ సిరీస్‌లు. రకరకాల జానర్లలో వెబ్‌సిరీస్‌లు ఒటిటిల్లో విడుదలై ఎంతో సక్సెస్‌ని సాధించాయి. అలా ఒప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆసక్తికర వెబ్‌సిరీస్ ‘పోచమ్మ’. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ అంబటి అర్జున్ ప్రధాన పాత్రలో నటించాడు.

శృతి నాయుడు నిర్మించిన ఈ సిరీస్‌కి రమేష్ చంద్ర దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ గ్లింప్స్‌ని ‘పెద్ది’ డైరెక్టర్ బిచ్చిబాబు విడుదల చేశారు. గ్లింప్స్‌ని బట్టి చూస్తే ఈ సిరీస్‌లో మిస్టరీతో పాటు డివైన్ టచ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పోచమ్మ దేవత గొప్పతనం, ఆమె మహిమ తెలియక తప్పులు చేసిన కొందరిని ఆమె ఎలా శిక్షించింది అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్‌ అని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు అనే డైలాగ్ ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో చెబుతోంది. ఇక ఈ సిరీస్‌ ఏప్రిల్ 17 నుంచి ఆహా ఒటిటిలో స్ట్రీమింగ్ కానుంది.