Reading Time: < 1 minute

హైదరాబాద్: కేరళ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం చేశారని, కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కెసిఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. బిసిలకు అన్యాయం చేశామని అంటున్నారు.. బిసిలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగించింది కాంగ్రెస్ పార్టీయేనని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల అమలు చేసినట్లు కేరళలో గొప్పలు పలుకుతున్న రేవంత్.. భవిష్యత్తులో తెలంగాణలోనూ అదే తరహా మాటలు చెప్పే ప్రమాదముందని అన్నారు.