Reading Time: < 1 minute

మూవీ రూల్జ్పై సీఎస్‌బీ లో కేసు నమోదు… మరో మూడు వెబ్‌ సైట్లపై కూడా..

Caption of Image.

హైదరాబాద్‌, వెలుగు: టాలీవుడ్ కొత్త సినిమాల పైరసీకి సంబంధించి మూవీ రూల్జ్ సహా నాలుగు వెబ్‌సైట్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) బుధవారం కేసు నమోదు చేసింది. ఇవి ఉస్తాద్ భగత్ సింగ్, రాజాసాబ్ వంటి కొత్త చిత్రాలను పైరసీ చేసినట్లు సీఎస్‌బీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. దాంతో అధికారులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొత్త తెలుగు సినిమాలను విడుదలైన రోజే మూవీ రూల్జ్​తోపాటు పలు వెబ్‌సైట్లలో క్వాలీటి పైరసీ ప్రింట్లను అప్‌లోడ్ చేస్తున్నాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్‌ ప్రాజెక్ట్‌ హెడ్‌ మనింద్ర బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. పైరసీ వల్ల పరిశ్రమకు భారీగా ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయని తెలిపారు. 

ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్, అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారీ కూడా పైరసీకి గురైనట్లు వివరించారు. ఇలా పైరసీ చేసిన చిత్రాలను మూవీరూల్జ్‌ సహా వెబ్‌సైట్లలో సాధారణ హోస్టింగ్ ప్రొవైడర్లు , డొమైన్ రిజిస్ట్రార్ల ద్వారా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.