Reading Time: < 1 minute
Nbk 113 Balakrishna To Team Up With Director Vijay Kanakamedala

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. తాజాగా బాలయ్య మరో టాలెంటెడ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ సినిమా చేస్తున్నారు బాలయ్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ భారీ విజయం సాధించడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Also Read : MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్

ఇక గోపీచంద్ తర్వాత.. బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్ NBK112ని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను త్వరలోనే మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు NBK113 డైరెక్టర్ కూడా ఫిక్స్‌ అయినట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘నాంది’ వంటి చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కనకమేడలకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. రీసెంట్‌గా బాలయ్యను కలిసి కథ వినిపించగా.. విజయ్ చెప్పిన పాయింట్ నచ్చడంతో వెంటనే ఓకె చెప్పినట్టుగా టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారట. ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.