Reading Time: < 1 minute

హైదరాబాద్: కామెడియన్ సత్యని హీరోగా పరిచయం చేస్తూ.. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జెట్లీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పలు మేకింగ్ వీడియోలను విడుదల చేసి అంచనాలను పెంచేశారు

తాజా ఈ సినిమా నుంచి ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అంటూ సాగే ఓ పాటని విడుదల చేశారు. ఈ పాటకి కాల భైరవ సంగీతం అందించగా.. సాయి సోమయాజులు సాహిత్యం అందించారు. శ్రావణ భార్గవి ఈ పాట పాడారు. ఈ పాటలో హీరోయిన్ రియా సింగ్‌తో కలిసి సత్య డ్యాన్స్ ఇరగదీశాడు. విజయ్ పొలాకి ఈ పాటకి కొరియోగ్రాఫీ అందించారు ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను చిరంజీవి(చెర్రీ), హేమలత నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.