Reading Time: < 1 minute
Ramayana : 4000 కోట్ల రూపాయల అద్భుతం: ‘రామాయణ’ గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు ₹4,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ‘రామాయణ’ రూపొందుతోంది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సినిమా సత్తాను చూపించే ప్రయత్నం. ఆస్కార్ విజేత హ్యాన్స్ జిమ్మర్ సంగీతం, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ఆడియన్స్‌కు కూడా చేరువ చేస్తున్నాయి. ఎన్ని హంగులు కూడా ఓ ఇండియన్ సినిమా 4000 కోట్ల బిజినెస్ చేయటం అన్నది సాధ్యమేనా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో మేకర్స్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ప్రతీ రూపాయిని క్యాలెక్యులేటెడ్‌గానే ఖర్చు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌ హాలీవుడ్‌ సినిమాకు డి-రిస్కింగ్‌ అనే స్ట్రాటజీ ఫాలో అవుతారు. అంటే సినిమా రిలీజ్‌కు ముందే భారీ డీల్స్ కుదర్చుకోవటం, గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ ద్వారా బడ్జెట్‌ పరంగా రిస్క్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కేవలం థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్ మార్గాల ద్వారానే కాకుండా.. వీలైనన్ని ఎక్కువ రంగాల నుంచి రెవెన్యూ సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. టెక్నాలజీ పరంగానూ అప్‌గ్రేడ్ అవుతూ సినిమాను ప్రపంచ ఆడియన్స్‌కు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు

రామాయణ సినిమాను 190 దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇంపార్టెంట్‌ లాంగ్వేజెస్‌లో మ్యాన్వువల్‌గానే డబ్బింగ్ ప్రాసెస్ జరుగుతోంది. కొన్ని భాషల్లో ఏఐ ద్వారానే డబ్బింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ఇలా టెక్నాలజీ వాడటం ద్వారా ప్రపంచంలోని ప్రతీ ఆడియన్‌కు సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ స్థాయిలో ఎక్కువ భాషల్లో, ఎక్కువ దేశాల్లో, రిలీజ్ అయిన సినిమాగా రామాయణ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది.

డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల ద్వారా కూడా భారీ మొత్తం రికవర్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది రామాయణ టీమ్. దాదాపు 50 భాషల్లో రిలీజ్‌ అవుతుండటంతో అన్ని భాషల్లో డిజిటల్‌, శాటిలైట్ బిజినెస్‌ను రిలీజ్‌కు ముందే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఫ్రాంచైజీగా రాబోతున్న ఈ సినిమాతో ఇండియన్ మేకర్స్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పటంతో పాటు మన సినిమా టెక్నాలజీ, ఫైనాన్స్‌ స్టాండర్డ్స్‌ను కూడా గ్లోబల్ రేంజ్‌లో చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.