Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆయన్నపాత్రుడి తప్పేం లేదని,  తాను మందు మత్తులో ఉన్నానని, తన కాలు వెళ్లి స్పీకర్ కు తగలడంతో తన చెంపపై దెబ్బ కొట్టాడని దళితుడు భాస్కర్ రావు వివరణ ఇచ్చాడు. తన కాలు ఆయనకు తగలడంతో కోపంలో కొట్టారన్నారు. దీనిపై రాజకీయాలు చేయొద్దని కోరారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జాతరలో దళితుడు ఎత్తుల భాస్కర రావు డప్పు కొడుతుండగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సదరు వ్యక్తిపై చేయిచేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.