
వాయువ్య భారతదేశంలో భారీ తుఫాను ఏర్పడనుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తీవ్రమైన తుఫాన్ ఏర్పడుతోందని పేర్కొంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా రాష్ట్రాల్లో ఏప్రిల్ 3 నుంచి 6 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇక గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Iran-US War: ఇరాన్‌పై అమెరికా దాడులు.. కూలిన అతి పెద్ద వంతెన.. 8 మంది మృతి
ఏప్రిల్ 3, 4 తేదీల్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 3-4 తర్వాత ఏప్రిల్ 7-8 తేదీల్లో వాయువ్య భారతదేశంపై చాలా చురుకైన పశ్చిమ అవాంతరం ప్రభావం చూపనుందని పేర్కొంది. దీంతో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ అంతటా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు
మధ్యప్రదేశ్ వార్నింగ్..
ఇక మధ్యప్రదేశ్‌కు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తదుపరి 2-3 గంటల పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేవాస్, ఖండ్వా, రత్నం జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది. గంటకు సుమారు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. అదే విధంగా గంటకు 15 మి.మీ కంటే ఎక్కువగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
District wise Nowcast Warning valid for next two-three hours:
Red Warnings: Lightning/Thunderstorms with gusty winds (around 60 kmph) and heavy rain (>15 mm/h) very likely over following districts in:Madhya Pradesh: Dewas, Khandwa, Ratlam; pic.twitter.com/pgqGpRwAsV
— India Meteorological Department (@Indiametdept) April 2, 2026