Reading Time: < 1 minute
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు ఇదే.. దీని వయసు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు అయిన 193 ఏళ్ల జోనాథన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగున్న ప్రచారాన్ని సెయింట్ హెలెనా, అసెన్షన్, ట్రిస్టన్ గవర్నర్ కార్యాలయం కొట్టి పారేసింది. జోనాథన్ ఇప్పటికీ సజీవంగా, ఆరోగ్యంగా ఉందని, సెయింట్ హెలెనాలో తన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సెయింట్ హెలెనా, అసెన్షన్, ట్రిస్టన్ గవర్నర్ కార్యాలయం ఏప్రిల్ 2, 2026న పోస్ట్ చేసింది.

అసలు ఏం జరిగింది?

ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో జోనాథన్ మరణించిందనే ఓ వార్త వైరల్‌గా మారింది. జోనాథన్ సంరక్షణ చూసుకునే పశువైద్యుడు డాక్టర్ జో హాలిన్స్ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా నుంచి ఈ తప్పుడు ప్రకటన వెలువడింది. ఆ పోస్ట్‌లో క్యాప్షన్‌లో ఎంతో పురాతనమైన, ఎన్నో యుద్ధాలను చూసిన జోనాథన్ అనే 193 ఏళ్ల వృద్ద తాబేలు మరణించిదని రాసుకొచ్చారు. దీన్ని కొద్ది గంటల్లోనే సుమారు 20 లక్షల మంది చూశారు. వారంతా ఇది నిజమేనని అనుకున్నారు. దీనిపై స్పందించిన సెయింట్ హెలెనా ద్వీప కమ్యూనికేషన్స్ హెడ్ ఆనీ డిల్లాన్ గురువారం అది కేవలం ఒక పుకారు మాత్రమే అని ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

జోనాథన్ చరిత్ర

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. జోనాథన్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు. 1882లో సెయింట్ హెలెనా అనే ద్వీపానికి ఈ తాబేలును తీసుకొచ్చారు. అప్పటికే ఈ తాబేటు వయసు దాదాపు 50 ఏళ్లు. అంటే ప్రస్తుతం అతని వయస్సు 193 ఏళ్లు. నెపోలియన్ బోనపార్టేను బహిష్కరించిన ప్రదేశంగా పేరుగాంచిన సెయింట్ హెలెనా ద్వీపంలోని గవర్నర్ కార్యాలయంలోని గార్డెన్‌లో ఈ జోనాథన్ నివాసం ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.