
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో 2026––27 కి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సీఈసీ గ్రూపులో 40సీట్లకు తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీఆర్‌జేసీ సెట్-2026) కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి మాధవి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సీఈసీ గ్రూప్లో ఖాళీలు ఫిలప్చేస్తామన్నారు.
ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థినిలు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ https://tgrjc.cgg.gov.in లో ఏప్రిల్ 15, 2026 వరకు స్వీకరించబడతాయని,ప్రవేశ పరీక్ష మే 3, 2026న జరుగుతుందన్నారు.