Reading Time: < 1 minute

నిర్మల్ జిల్లాలో పురుగుల మందు తాగిన సర్పంచ్.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం

Caption of Image.

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి ఆత్మహత్యాయత్నం చేయడం.. ఆపై ఆసుపత్రికి తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే.. మాసాయిపేట సర్పంచ్ లహరి  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను  వెంటనే  కారులో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. లహరిని తీసుకువెళ్తున్న కారు వేగంగా వెళ్తూ మార్గమధ్యలో అదుపు తప్పింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినగా..  లహరి పరిస్థితి మరింత విషమించింది.  వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచారు. ఒకే రోజు అటు ఆత్మహత్యాయత్నం, ఇటు రోడ్డు ప్రమాదం జరగడంతో మాసాయిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ALSO READ : కవిత పార్టీ పేరు TRSగా ఆలోచన

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సర్పంచ్ లహరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలేంటి? ప్రమాదం ఎలా జరిగింది? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.