Ola Electric Bike: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు హవా కొనసాగిస్తున్నాయి. గతంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాయి. అయితే మార్కెట్లో ఈ వాహనాలు వచ్చిన తర్వాత కొనుగోలు చేసేందుకు వాహనదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఫోర్ విల్లర్, టూ విల్లర్ వాహనాలు అందుబాటులోకి రాగా, మరిన్ని వాహనాలు మార్కరెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ప్రీమియం మోటార్ సైకిల్ ‘రోడ్‌స్టర్ X+ 9.1kWh’ ధరపై భారీగా తగ్గించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ధర వివరాలు: పాత ధర: రూ.1,89,999, తగ్గిన తర్వాత ధర: రూ.1,29,999 (ఫ్లాట్ రూ.60,000 తగ్గింపు) ధర తగ్గడానికి ప్రధాన కారణం: ఓలా తన స్వంత ‘గిగా ఫ్యాక్టరీ’లో తయారు చేసిన 4680 భారత్ సెల్‌ను ఈ బైక్‌లో వినియోగించింది. ఈ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తి వేగవంతం కావడంతో తయారీ ఖర్చు తగ్గింది. ఆ ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్లకే అందించాలని ఓలా నిర్ణయించింది.
ఇందులో ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న #EndICEAge క్యాంపెయిన్ వల్ల ఈ బైక్‌కు మార్కెట్లో ఐదింతల డిమాండ్ పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ తగ్గింపు ధర అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. దీనిని ఒక పరిమిత సమయం (Limited Time Window) కోసం మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే ఈ పర్చేజ్ విండో తెరిచి ఉంటుంది.
స్టాక్ లభ్యతను బట్టి భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు కొనుగోలుకు అవకాశం ఉంటుందో కంపెనీ ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న ఓలా, ఈ భారీ తగ్గింపుతో పెట్రోల్ బైక్ వినియోగదారులను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది.




