Reading Time: < 1 minute

రుచికరమైన బేసన్ దేశ.. హోటల్ స్టైల్ చట్నీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు…

Caption of Image.

మనం బయట హోటల్‌కు వెళ్ళినప్పుడు తినే క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే అంతే రుచిగా రావాలంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. కేవలం బియ్యం, పప్పులే కాకుండా.. అటుకులు, మెంతులు వంటివి  మోతాదుగా కలిపితే దోశ ఎంతో ఎర్రగా, కరకరలాడుతూ వస్తుంది. దానికి తోడు నోరూరించే ఆలు మసాలా, తియ్యతియ్యగా-కారంగా ఉండే కొబ్బరి చట్నీ తోడైతే ఆ రుచే వేరు!

మరి ఇంట్లోనే అందరూ మెచ్చుకునేలా పర్ఫెక్ట్ మసాలా దోశ, దానికి కాంబినేషన్‌గా అదిరిపోయే చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా…..

కావలసిన పదార్థాలు: బియ్యం : 4 కప్పులు గంటలు నానబెట్టాలి
 మినప్పప్పు: ఒక కప్పు (5 గంటలు నానబెట్టాలి) 
శెనగపప్పు: ఒక కప్పు,

అటుకులు: కొంచెం 
మెంతులు: ఒక టేబుల్ స్పూన్ 
పంచదార: ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా, 
బేకింగ్ సోడా: చిటికెడు

మసాలా కోసం 
బంగాళదుంపలు: రెండు (మెత్తగా ఉడికించాలి)
ఉల్లిపాయలు: రెండు (సన్నగా తరిగి నెయ్యిలో ఫ్రై చేయాలి) 
ఉప్పు: రుచికి సరిపడా 

చట్నీ కోసం….
కొబ్బరి తురుము : ఒక కప్పు, 
పచ్చిమిర్చి: నాలుగు 
పంచదార: ఒక కప్పు, 
అల్లం : చిన్న ముక్క 
కొత్తిమీర తరుగు: కొంచెం
పోపుదినుసులు: మూడు టేబుల్ స్పూన్లు 
 ఇంగువ: చిటికెడు
నూనె : ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు : రుచికి తగినంత

తయారీ విధానం 
దోశ కోసం సిద్ధం చేసుకొన్న పదార్థాలన్నీ మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని రాత్రంతా పక్కన పెట్టాలి. తర్వాత రోజు స్టవ్ మీద పాన్ పెట్టి పిండిని పల్చటి దోశలా వేయాలి. రెండు వైపులా దోరగా కాలే వరకు కొద్దిగా నెయ్యి వేయాలి. మసాలా కోసం రెడీ చేసుకొన్న పదార్థాలన్నీ దోశ మీద ఒక పొరలా .. పరచాలి, లేదంటే మధ్యలో పెట్టి దోశను మడతపెట్టుకుంటే సరిపోతుంది. చట్నీ కోసం రెడీ చేసుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి… ఈ చట్నీతో బేసన్ దేశ రుచిగా బాగుంటుంది.

©️ VIL Media Pvt Ltd.