
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 3) జరిగే 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పంజాబ్ తమ మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం సాధించగా, చెన్నై రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (c), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, వైషక్ విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI: సంజు శాంసన్ (వికెట్), రుతురాజ్ గైక్వాడ్ (సి), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్