Reading Time: 2 minutes
Pbks Beat Csk By 5 Wickets In Ipl 2026 Chennai Faces 6th Straight Home Loss At Chepauk

PBKS vs CSK: ఐపీఎల్ 2026 సీజన్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కష్టాలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా పంజాబ్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సొంత గడ్డపై చెన్నైకి ఇది వరుసగా ఆరో ఓటమి. దీనితో చెన్నై అభిమానులు నిరాశకు గురి అవుతున్నారు. గత సీజన్‌లో ఐదు హోమ్ మ్యాచ్‌ లలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ ఏడాది కూడా అదే పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ ఇంకా విజయాల ఖాతాను ఇంకా తెరవలేదు.

Saturday Horoscope: శనివారం రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిందే..!

ఇక CSK vs PBKS మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఆదిలోనే చుక్కెదురైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ పవర్‌ప్లేలో పరుగులు తీయడానికి ఇబ్బంది పడటంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే 18 ఏళ్ల యువ సంచలనం ఆయుష్ మ్హాత్రే క్రీజులోకి రావడంతో ఆట స్వరూపమే మారిపోయింది. మ్హాత్రే కేవలం 43 బంతుల్లో 73 పరుగులతో రెచ్చిపోవడంతో జట్టుకు 200+ స్కోరు అందించాడు. అతనికి తోడుగా చివరిలో శివమ్ దూబే (45), సర్ఫరాజ్ ఖాన్ (32) మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో విజయ్‌ కుమార్ వైశాక్ రెండు వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్ పొదుపుగా బౌలింగ్ చేసి చెన్నైని కట్టడి చేశాడు.

ఇక భారీ బాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీనితో పంజాబ్ కేవలం 3.2 ఓవర్లలోనే 50 పరుగులతో ఫ్లయింగ్ స్టార్ట్ ను అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో సిఎస్‌కెపై నమోదైన వేగవంతమైన ఫిఫ్టీ ఇదే కావడం విశేషం. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 43 పరుగులు, కూపర్ కానలీ 36 పరుగులతో రాణించారు.

Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

ఇక మిడిల్ ఓవర్లలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ తో విజయాన్ని ఖాయం చేశాడు. అయ్యర్ 17వ ఓవర్లో అవుట్ అయినప్పటికీ, చివర్లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో పంజాబ్ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లగా, చెన్నై మాత్రం వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేయుకుంది.