Reading Time: < 1 minute
ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌

‘నాకు చదువుకోవాలని ఉంది సార్.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి.. ఎలాగైనా నేను చదువుకునే అవకాశం కల్పించండి ప్లీజ్’ అంటూ ఒక చిన్నారి చేసిన అభ్యర్థన కలెక్టరేట్‌లో అందరినీ కదిలించింది. కరీంనగర్‌ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో గ్రీష్మ అనే 7వ తరగతి బాలిక ఆవేదన అధికారులను కదిలించింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిని గ్రీష్మ అనే బాలిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. గత కొంతకాలంగా గ్రీష్మ తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో మరెవరూ దిక్కు లేకపోవడంతో, ఆ చిన్నారి తన చదువును పక్కన పెట్టి ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంది. తల్లికి సేవలు చేస్తూ పాఠశాలకు సరిగ్గా హాజరు కాలేకపోయింది. పరిస్థితులు కాస్త కుదుటపడ్డాక తిరిగి స్కూల్‌కు వెళ్దామనుకుంది. ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేరదామని వెళ్లింది. అయితే పాత పాఠశాల నుంచి టీసీ రావడం ఆలస్యం కావడంతో స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించారు. పరీక్షలు సమయం దగ్గరపడుతుండటంతో.. తను పరీక్షలు రాయలేనేమో, ఈ సంవత్సరం కూడా వృథా అయిపోతుందని ఆవేదన చెందిన గ్రీష్మ చేసేది లేక నేరుగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు తన పరిస్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. గ్రీష్మ ఆవేదన అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది. బాలిక తపనను చూసి చలించిపోయిన కలెక్టర్‌ వెంటనే స్పందించి, జిల్లా విద్యాశాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. బాలికకు వెంటనే ప్రవేశం కల్పించి, ఆమె పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాకలెక్టరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’

ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి

నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్

Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు

ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ