Reading Time: < 1 minute

ఏప్రిల్ 03, 04న ఉమ్మడి ఆదిలాబాద్ లో పీసీసీ చీఫ్ పర్యటన

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ ​గౌడ్ రెండు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశానికి  హాజరవుతారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటా రు. 

శనివారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం, మధ్యాహ్నం నిర్మల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. జిల్లాల వారీ గా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

©️ VIL Media Pvt Ltd.