
బీజేపీ కులం, మతం పేరుతో రాజకీయాం చేస్తోందని..ఆ పార్టీకి తెలంగాణలో స్థానం లేదని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. రాముడేమైనా బీజేపీ జాగారీ..వాళ్ల పార్టీల సభ్యత్వం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన ఆయన.. దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు.సన్నబియ్యం పథకం దేశంలోనే చారిత్రాత్మకమన్నారు.
బీఆర్ఎస్ చేసిన అప్పులు కాంగ్రెస్ కడుతోందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో నేతల జేబుల్లోకి డబ్బులు వెళ్లాయన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీం సక్సెస్ గా నడుస్తోందన్నారు. బీజేపీ రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వట్లేదన్నారు. కేంద్రం లాభాల్లో ఉన్న సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. 12 ఏండ్లలో కేంద్రం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు మహేశ్ కుమార్ గౌడ్. ఇందిగాంధీ నుంచి రాహుల్ వరకు పేదల కోసం పనిచేస్తున్నారని అన్నారు.
►ALSO READ | ఏ పార్టీలోకి వెళ్లేది వారంలో చెబుతా: జీవన్ రెడ్డి
బీఆర్ఎస్ చీప్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని అన్నారు. దోచుకున్న సొత్తులో వాటాల గొడవలతో ఆ పార్టీ రోడ్డున పడిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ తో 5 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయన్నారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు మహేశ్ కుమార్ గౌడ్.