
రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. వేసవి కాలంలో రెండు రోజులు ఎండ, తరువాత వర్షాలతో విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా మే నెలలో వడగాల్పులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయి. కానీ ప్రస్తుతం మార్చి నెల నుంచే వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులు, ఈదురు గాలులో కూడిన వర్షాలు రాష్ట్రంలో అక్కడక్క కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
శనివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసాఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకొని పంటలను రక్షించుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కాగా, మరో రెడు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెల కొంటుదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.