Reading Time: 2 minutes

IPL 2026: పంజాబ్ Vs చెన్నైహెడ్ To హెడ్ రికార్డ్స్.. లాస్ట్ 7 మ్యాచుల్లో అయ్యర్ సేనదే హవా

Caption of Image.

ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 3) చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ ఆసక్తికర పోరు జరగనుంది. టోర్నీని ఓటమితో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ సొంత గడ్డపై విజయంతో బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గుజరాత్‎పై ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ ఘనంగా టోర్నీని ఆరంభించింది. ఇవాళ్టి మ్యాచులో గెలుపు కోసం ఇరు జట్లు ఉత్సుకతతో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్‎లో పంజాబ్, చెన్నై ఇప్పటి వరకు ఎన్నిసార్లు తలపడ్డాయి.. టోర్నీలో ఎవరిది పైచేయి అనే విషయం తెలుసుకుందాం.

పంజాబ్, చెన్నై హెడ్ టూ హెడ్ రికార్డులు:

క్యాచ్ రిచ్ లీగ్‎లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు 32 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై, పంజాబ్ చెరో 16 మ్యాచుల్లో విజయం సాధించి సమఉజ్జీవులుగా ఉన్నాయి. అయితే, చివరి 7 మ్యాచులను పరిశీలిస్తే మాత్రం పూర్తిగా పంజాబ్‎దే ఆధిపత్యం. చివరి ఏడు మ్యాచుల్లో పంజాబ్ ఆరుసార్లు గెలవగా.. చెన్నై ఒక మ్యాచులో మాత్రమే విజయం సాధించింది. టోర్నీలో అత్యధిక టైటిల్స్ గెలిచిన చెన్నైను ఈ చెత్త రికార్డ్ కలవరపాటుకు గురి చేస్తోంది. మరోవైపు చెన్నైపై ఇవాళ్టి మ్యాచులో కూడా విజయం సాధించి తమ హవా కొనసాగించాలని పంజాబ్ భావిస్తోంది.  

ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్ట్:

ఎంఏ చిదంబరం స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‎కు అనుకూలం. ఈ పిచ్‎లో యావరేజ్ స్కోర్ 173. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకుంటే 200 నుంచి 230 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. దీన్నిబట్టి చూస్తే ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. దీంతో ఈ గేమ్‌లో భారీగా పరుగుల వరద పారే ఛాన్స్ ఉంది. ఇక మ్యాచ్ సాగుతున్న కొద్దీ మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన టీమ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.

►ALSO READ | IPL 2026: పంజాబ్ Vs చెన్నై మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే.. టాస్ గెలిస్తే బౌలింగ్ బెస్ట్..!

©️ VIL Media Pvt Ltd.