
హైదరాబాద్: మహానగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్ లపై ఈగల్ టీమ్ పోలీసులు దాడులు చేశారు. కొండాపుర్ లోని క్వాక్ ఎరినా పబ్ లో ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. గురువారం రాత్రి సౌతాఫ్రికా కు చెందిన ప్రముఖ డిజె బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ ను పబ్ నిర్వాహకులు నిర్వహించారు. ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించడంతో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చినవారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.