Reading Time: < 1 minute

వికారాబాద్లో డిగ్రీ కాలేజీ భవనం ప్రారంభం

Caption of Image.

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​డైట్ కాలేజీ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్​కు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.వి. గీతా లక్ష్మీ పట్నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, మాజీ చైర్మన్ వి.సత్యనారాయణ పాల్గొన్నారు.

అలాగే శ్రీజగజ్యోతి బసవేశ్వర విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఎన్నేపల్లిలో కొత్త నిర్మించిన వీరశైవ బసవ భవనాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. పీఠాధిపతి డాక్టర్ చెన్న బసవప్రభు స్వామి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎంపీ బీబీ పాటిల్ తదితరులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.