
నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 35 మంది టూరిస్టులతో హైదరాబాద్ వస్తున్న బస్సు వర్ని మండలం బడాపహాడ్ శివారు లో బోల్తా పడింది. పటాన్ చెరుకు చెందిన యాత్రికులు ప్రైవేట్ స్కూల్ బస్సులో వస్తుండగా శుక్రవారం (ఏప్రిల్ 03) జరిగింది ఈ ఘటన.
బడా పహాడ్ అటవీ ప్రాంతంలో మూల మలుపు వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడినట్లు ప్రయాణికులు తెలిపారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.