Reading Time: < 1 minute
Boost Your Sexual Stamina Naturally With Almonds Cashews And Walnuts

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం మరియు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలామందిలో లైంగిక ఆసక్తి తగ్గడం లేదా సామర్థ్యం లోపించడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

 Also Read : Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

బాదం, జీడిపప్పు, మరియు అక్రోట్స్ వంటి నట్స్‌లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే సెలీనియం మరియు జింక్ వంటి మూలకాలు పురుషుల్లోనూ, స్త్రీలలోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఈ నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడులో ‘డొపమైన్’ స్థాయిలు పెరుగుతాయి. డొపమైన్ అనేది మెదడులో విడుదలయ్యే ఒక రసాయనం ఇది మనకు సంతోషాన్ని మరియు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శరీరంలో డొపమైన్ స్థాయిలు పెరిగినప్పుడు సహజంగానే లైంగిక కోరికలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు మానసిక ప్రశాంతత లభించి, శృంగారంలో చురుగ్గా పాల్గొనేందుకు దోహదం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలో ఈ నట్స్‌ను తీసుకోవచ్చు. మితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సహజ సిద్ధమైన పద్ధతుల్లో మీ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకునే వారికి ఇవి ఉత్తమమైన ప్రత్యామ్నాయం. మీ ఆహార నియమాలలో వీటిని చేర్చుకుని శృంగార జీవితంలో సెంచరీ  కొట్టండి.