Reading Time: < 1 minute
How To Clean Burnt Vessels Pots Pans Kitchen Hacks Telugu

Kitchen Tips: ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు గిన్నెలు మాడిపోవడం సహజం. ముఖ్యంగా పాలు మరిగించేటప్పుడో లేదా కూరలు వండేటప్పుడో కాస్త అటు ఇటు అయితే చాలు, గిన్నె అడుగు భాగం నల్లగా మాడిపోతుంది. అలాంటి మాడిన గిన్నెలను తోమడం అనేది ఇంట్లో వాళ్లకు ఒక పెద్ద సవాలుతో కూడిన పని. ఎంత గట్టిగా రుద్దినా ఆ మాడిపోయిన నలుపు మరకలు అంత ఈజీగా వదలవు. దీని గురించి ఇకపై అస్సలు కంగారు పడక్కర్లేదు. పనికిరాదు అనుకుని పక్కన పడేసిన మాడిన గిన్నెలను కూడా కేవలం ఐదు నిమిషాల్లో కొత్త దానిలా మెరిపించే ఒక అద్భుతమైన చిట్కా ఈ స్టోరీలో తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో సులభంగా ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేయాలో చదివేయండి.

READ ALSO: CM Revanth: తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చుదిద్దుతాం..

మాడిన గిన్నెలను శుభ్రం చేయడానికి కావలసినవి:

వంట సోడా (Baking Soda) – 1 టీస్పూన్

సర్ఫ్ లేదా డిష్ వాష్ లిక్విడ్ – 1 టీస్పూన్

నీళ్లు – గిన్నెలో సగం వరకు

నిమ్మరసం – సగం చెక్క (అవసరమైతే)

ఇలా శుభ్రం చేయండి..
ముందుగా మాడిన గిన్నెలో సగం వరకు నీటిని పోయాలి. తర్వాత అందులో ఒక టీస్పూన్ వంట సోడా, ఒక టీస్పూన్ సర్ఫ్ లేదా డిష్ వాష్ లిక్విడ్ వేయాలి. అనంతరం ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి, నీటిని బాగా మరిగించాలి. తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు లోపల ఉన్న మాడంతా మెల్లమెల్లగా వదిలి పైకి రావడం జరుగుతుంది. ఆ టైంలో మీరు స్పూన్‌తో అడుగున గీకితే మాడంతా సులభంగా పోతుంది. నీరు బాగా మరిగి, మాడంతా వదిలిన తర్వాత ఆ నీటిని పారబోయాలి. చివరగా గిన్నెను సాధారణ డిష్ వాష్ సోపు, స్క్రబ్బర్‌తో ఒకసారి తోమితే, గిన్నె కొత్త దానిలా తళతళలాడుతుంది. ఈ చిట్కా ద్వారా స్టీల్ గిన్నెలే కాకుండా, అల్యూమినియం గిన్నెలను కూడా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఇకపై మీ ఇంట్లో గిన్నెలు మాడిపోతే కంగారు పడకుండా ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకోండి.

READ ALSO: TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్‌.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?