Reading Time: < 1 minute

శుక్రవారం పెరిగిన గోల్డ్.. వెండి పరిస్థితి ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే..

Caption of Image.

అమెరికా ఇరాన్ పై యుద్ధంలో ట్విస్టులు గంటగంటకూ మారిపోతున్నాయి. దీంతో బంగారం కొన్ని రోజులుగా కొద్దిగా పెరుగుతూ మళ్లీ తగ్గుతూ దాదాపుగా ఒకే రేంజ్ లో కొనసాగుతోంది. అయితే వెండి పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. దాదాపుగా 15 రోజుల నుంచి వెండి తెలుగు రాష్ట్రాల్లోని రేట్లు పెద్ద మార్పులకు గురికాలేదు. ఈ క్రమంలో తెలుగు ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటుంటే రెండు రాష్ట్రాల్లోని రేట్లను ముందుగా పరిశీలించటం ముఖ్యం. 

ఏప్రిల్3న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఏప్రిల్2 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.196 పెరిగింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 093గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 835గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్ 3, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు స్థిరంగా రూ.2లక్షల 50వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.250గా అమ్మకాలు జరుగుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.