Reading Time: 2 minutes

కవిత పార్టీ పేరు TRSగా ఆలోచన : పాత పేరుతో కొత్త జెండా

Caption of Image.

కొత్త పార్టీతో వస్తున్న కవిత.. పేరు, ఎజెండాపై మనసులోని మాటను బయటపెట్టారు. కొత్త పార్టీకి TRS.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారామె. పాత పేరుతో కొత్త జెండా ఎలా ఉంటుంది అంటూ మీడియా చిట్ చాట్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం కవిత. టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఖాళీగానే ఉందని.. ఆ పేరుతో పార్టీ పెడితే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నామని.. కాకపోతే పార్టీ జెండాలో పింక్ కలర్ మాత్రం ఉండదంటూ చెప్పుకొచ్చారు కవిత.

కవిత కామెంట్స్:

  • తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టాలనే ఆలోచన చేస్తున్నాం
  • పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్ పని చేస్తుంది.
  • ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతాలు ఉంటాయి… 
  • బీహార్ సిద్ధాంతాలు ఉండవు మా పార్టీలో
  • పార్టీ ఆవిర్భావం రోజు అమరవీరుల స్తూపం వద్దకి వెలుతాం
  • పార్టీ ఆవిర్భావం రోజు స్టేజ్ పైన ఉద్యమ కారులు ఉంటారు
  • DSP విశారదన్ మహరాజ్ తో కలిసి పనిచేస్తాం
  • మా ప్రధాన శత్రువు కాంగ్రెస్
  • బీఆర్ఎస్ పార్టీ రిచ్ పార్టీ
  • గుంపు మేస్త్రి గుంట నక్క దోస్తులు
  • సిద్దిపేట నియోజకవర్గ మహిలా రిజర్వేషన్ వస్తే పోటీ చేస్తా..
  • గజ్వేల్ మహిళా రిజర్వేషన్ వచ్చినా ఆలోచిస్తా..
  • అయినా నిజామాబాద్ లో చాలా సీట్లు ఈ సారి మహిళా రిజర్వేషన్ లోకి వస్తాయి
  • రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని అసలు సిటీని చంపకుంటే చాలు..
  •  రేవంత్ మహారాష్ట్రలో ప్రచారం చేసి కాంగ్రెస్ ను ఓడించాడు..
  • ఇప్పుడు కేరళలో ప్రచారం చేసి ఒడిస్తాడు
  • ఆంధ్రలో అమరావతి ఉంటే ఎంత లేకుంటే ఎంత..
  • మాకు తెలంగాణ ప్రయోజనలే ముఖ్యం.. ఆంధ్ర గురుంచి పట్టించుకోము
  • కేసీఆర్ కష్టపడితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.. అలాగే జాగృతి కోసం కష్టపడుతాం
  • నా లిక్కర్ కేసు కొట్టేయడం.. నాకు ప్రకృతి సహకరిస్తుంది అనేది అనిపిస్తుంది
  • ఎంత తెలివి ఉన్న వాణ్ణి అయినా ఆపొచ్చు కానీ..అదృష్టవంతుణ్ణి ఎవరు ఆపలేరు
  • హార్డ్ వర్క్ లో చంద్రబాబు సూపర్..
  • పార్టీ నిర్మాణం లో  టీడీపీ చాలా  స్ట్రాంగ్ 
  • ఆడబిడ్డకు ఓటేయడమనేది ఒక ఎమోషన్
  • భగవత్ గీత చాలాసార్లు చదివాను…
  • ఇంకా చదువుతూనే ఉన్న
  • అందులో ఉన్న నీతి చాలా గొప్పది…
  • యుద్ధం చేయాల్సిందే.
©️ VIL Media Pvt Ltd.