Reading Time: 2 minutes

Biker Review: ‘బైకర్’ రివ్యూ.. శర్వానంద్ రేసింగ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Caption of Image.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు తన రూట్ మార్చి ఒక సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బైకర్’ (Biker). 

శుక్రవారం, ఏప్రిల్ 3, 2026న భారీ అంచనాల మధ్య ‘బైకర్’ విడుదలైంది. ‘లూజర్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ సినిమాని స్టైలిష్ రేసింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు.

టీజర్, ట్రైలర్‌లలో చూపించిన హై-ఆక్టేన్ రేసింగ్ సీక్వెన్స్‌లు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఇక ‘బైకర్’ విడుదలైన తర్వాత ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది? రేసింగ్ థ్రిల్ ఎంతవరకు ఆకట్టుకుంది? అనే విషయాలను పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

‘బైకర్’ కథ: 

హీరో విక్కీ (శర్వానంద్) ఒక టాప్ మోటోక్రాస్ రేసర్. తండ్రి సునీల్ (రాజశేఖర్) ట్రైనింగ్‌తో నెంబర్‌వన్‌ ఛాంపియన్‌గా ఎదుగుతాడు. ఎలాగైనా విక్కీని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఛాంపియన్‌గా నిలబెట్టాలని తండ్రి సునీల్ కలలు కంటాడు.

ఈ లక్ష్యంతో ఐఎన్‌జీ అనే స్పాన్సరింగ్ కంపెనీ అధినేత (అతుల్ కులకర్ణి)తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అయితే, అంతర్జాతీయ స్థాయికి అడుగుపెట్టే కీలక సమయంలోనే విక్కీ అనూహ్యంగా రేసింగ్‌ను వదిలేస్తాడు. 

ఇంతకీ విక్కీ రేసింగ్‌ను ఎందుకు వదిలేశాడు? అతని సడెన్ డెసిషన్కి కారణం ఏమిటి? విక్కీ లైఫ్ లోకి అనన్య (మాళవిక నాయర్) వచ్చాక ఏం జరిగింది? చివరికి విక్కీ తిరిగి రేసింగ్‌లోకి వచ్చాడా? తండ్రి కల నెరవేరిందా? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘బైకర్’ కథ.

ఎలా ఉందంటే:

‘బైకర్’ మూవీ ప్యూర్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. రేసింగ్ సీక్వెన్స్‌లను హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయి. వేగం, భావోద్వేగాలు, గెలుపు కోసం చేసే పోరాటం చుట్టూ కథ అల్లుకున్నారు డైరెక్టర్ అభిలాష్. సాధారణంగా మన దగ్గర క్రికెట్, కబడ్డీ, వాలీబాల్‌, బాక్సింగ్‌, హాకీ నేపథ్యంలో సినిమాలు వస్తుంటాయి, కానీ బైక్ రేసింగ్ (Motocross) నేపథ్యంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. ‘బైకర్’ చిత్రానికి ఇదే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.

ఇందులో శర్వానంద్ ఒక ఉత్సాహవంతుడైన రేసర్‌గా కనిపంచి ఆకట్టుకున్నారు. రాజశేఖర్ ఆయనకు దిశానిర్దేశం చేసే తండ్రిగా, మెంటర్‌గా కనిపించారు. రేసింగ్‌ వదిలేసి సాధారణ జీవితం గడుపుతున్నట్లుగా హీరో.. తిరిగి మళ్ళీ రేసింగ్లో పుంజుకోవడం వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. “చీకటి గదిలో కూర్చుని ఎవరో రాసిన కథలు చూడడానికి అలవాటు పడితే, నీ కథ నువ్వు రాసుకోలేవు” అనే డైలాగ్స్ సినిమా చూసే ప్రేక్షకుల్ని సైతం ప్రభావితం చేస్తాయి.

ఓవరాల్గా చెప్పాలంటే..‘‘బైక్ అనేది అందరికీ ఒక ఎమోషన్. ఇందులో రేసింగ్‌‌‌‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. ఫాదర్ అండ్-సన్ మధ్య ఉండే ఎమోషన్ ప్రతి ఒక్కరికీ  కనెక్ట్ అవుతుంది. జిబ్రాన్ అందించిన మ్యూజిక్ రేసింగ్ టైంలో మంచి హై ఇస్తుంది.

నటీనటులు: 

శర్వానంద్‌ హై ఇంపాక్ట్ ఇచ్చేలా నటించాడు. ఈ పాత్ర కోసం అతను పడిన కష్టం స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది. ‘మానసికంగా, శారీరకంగా తనని తాను మలుచుకున్నాడు. ఈ రోల్ కోసం బరువు తగ్గడంతో పాటు ఎన్నోసవాళ్లు ఎదుర్కొన్నారు. నటుడు రాజశేఖర్ తండ్రిగా, మెంటర్ గా సునీల్ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్‌ మాళ‌విక నాయ‌ర్ తన సస్పెన్స్ పాత్రతో మెప్పించింది. బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి  మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు.

©️ VIL Media Pvt Ltd.