
ప్రముఖ సినీ ప్రముఖులు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఏప్రిల్ 3, 2026న ఉదయం విఐపి విరామ సమయంలో టాలీవుడ్ నటి శ్రియ వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంలోనే ప్రముఖ బెంగాలీ హీరో జీతేంద్ర మద్నాని (జీత్) కూడా తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలతో పాటు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ క్రమంలోనే శ్రియను గుర్తించిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నటి శ్రీయ విషయానికి వస్తే.. తన పూర్తీ పేరు శ్రియా సరన్. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఇటీవలే తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీలో నటించి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ALSO READ : ‘చిన్న బాబు’కి నా ప్రేమ.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్..
హీరో జితేంద్ర మద్నాని బెంగాలీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే అగ్ర నటులలో ఒకరిగా కొనసాగుతున్నారు. నటుడు, నిర్మాత మరియు టీవీ వ్యాఖ్యాతగా రాణిస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 50కి పైగా చిత్రాల్లో నటించి, బెంగాలీ సినిమాలో “బాస్”గా పేరు తెచ్చుకున్నారు.