Reading Time: < 1 minute

PEDDI: ‘పెద్ది’ కొత్త పోస్టర్ బ్లాస్ట్.. చరణ్ రౌద్రానికి సోషల్ మీడియా షేక్

Caption of Image.

హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ‘పెద్ది’ చిత్రంలోని స్పెషల్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రామ్ చరణ్.. పెద్ద గదను పట్టుకుని పెహల్వాన్ అవతార్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. తన కెరీర్‌‌లోనే మోస్ట్ ఇంటెన్స్ లుక్‌‌లో కనిపిస్తున్నాడు.

ఒక పల్లెటూరి అఖాడా (కుస్తీ పట్టే స్థలం) మధ్యలో నిలబడి వుండగా, హనుమాన్ స్ఫూర్తితో ఉన్న ఆయన ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. పెహల్వాన్‌‌లా తీర్చిదిద్దుకున్న శరీరం, ఒత్తైన గడ్డం, వెనక్కి కట్టిన జుట్టుతో రగ్గడ్ గెటప్‌‌లో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అతని చుట్టూ ఎగిసిపడుతున్న ధూళి ఆ క్షణంలోని ఇంటెన్సిటీని పెంచుతోంది. బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో కుస్తీ సాధన చేస్తున్న రెజ్లర్లు పోస్టర్‌‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు.

బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ చిత్రంలో చరణ్.. క్రికెటర్‌‌‌‌గా, పెహల్వాన్‌‌లా కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా, శివ రాజ్‌‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ,  బోమన్ ఇరానీ ఇతర ముఖ్య  పాత్రలను పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో   వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.