Reading Time: < 1 minute

నల్గొండ జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం… చిన్నారి ముఖం పీక్కు తినేసింది…

Caption of Image.

నల్గొండ జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసి.. ముఖం పీక్కు తినేసిందిపిచ్చి కుక్క. శుక్రవారం ( ఏప్రిల్ 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా నకిరేకల్ లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. నకిరేకల్ కే చెందిన నాలుగేళ్ళ శరత్ చంద్ర అనే బాలుడు వీధిలో ఆడుకుంటుండగా.. దాడి చేసింది పిచ్చి కుక్క.

చిన్నారిపై దాడి  చేసిన పిచ్చి కుక్క ముఖాన్ని పట్టుకు పీక్కు తినేసింది. ఈ ఘటనలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన శరత్ చంద్రను ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు నానమ్మ, తాతలు.  తీవ్ర గాయాలైన చిన్నారి శరత్ చంద్రకు ప్రధమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు డాక్టర్లు.

కుక్కకు పిచ్చి లేచి అందరినీ కరుస్తుందని.. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిన్నారి శరత్చంద్ర తల్లిదండ్రులు. పిచ్చి కుక్కను కట్టడి చేసి తమ బాబులా ఇంకెవరికీ ప్రాణాపాయం కలగకుండా చూడాలని కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.