తమిళంలో తెరకెక్కించిన చిన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఎలాంటి హాడావిడి, ప్రచారాలు లేకుండా సైలెంట్ గా విడుదలై.. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సత్తా చాటుతుంది. యాక్షన్ సీన్స్, గ్లామర్ సాంగ్స్, స్టార్ హీరో లేకపోయినప్పటికీ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా..?
మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు మేడ్ ఇన్ కొరియా. హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చాయి. రా. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.
ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’ ఇంకా థియేటర్లలో విడుదల కాలేదు. నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. మిళం, తెలుగు, మలయాళం, కన్నడ హిందీతో సహా 12 భాషల్లో విడుదలైంది. ఫీల్-గుడ్ చిత్రంగా రూపొందించబడిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకుపోతుంది.
కథ విషయానికొస్తే, తమిళనాడులోని కడకోడి గ్రామానికి చెందిన ప్రియాంక మోహన్ కొరియన్ తన ప్రియుడితో కలిసి కొరియా వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ తనకు తెలియకుండా ఇచ్చిన డబ్బు తీసుకుని ప్రియాంక బాయ్ ఫ్రెండ్ పారిపోతాడు. దీంతో ఒంటరిగా కొరియా వెళ్లిపోతుంది. అక్కడ ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది సినిమా.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కోటికి పైగా వ్యూస్ పొందింది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన అత్యంత విజయవంతమైన తమిళ చిత్రంగా ఇది నిలిచింది. నెట్ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో ఇది ప్రపంచవ్యాప్తంగా 54 దేశాలలో ట్రెండింగ్లో ఉందని ప్రకటించబడింది. ప్రియాంక మోహన్ కెరీర్ లో మలుపు తిప్పిన మూవీ.




