Reading Time: < 1 minute

టీం ఇండియా మాజీ ఆల్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మాజీ సారథులు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణ చెప్పాలంటూ యవీ అన్నాడు. కపిల్ హయాంలో తనకు, ధోనీ హయాంలో తన కుమారుడు యువీకి అన్యాయం జరిగిందని యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఇటీవల ఓ చోట వ్యాఖ్యానించారు. భారత్‌కు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌లపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సోషల్‌మీడియాలో అభిమానులు మండిపడ్డారు. తాజాగా దీనిపై యువరాజ్ సింగ ఓ పాడ్‌క్యాస్ట్‌లో ఇరువురు కెప్టెన్లకు క్షమాపణలు కోరాడు. ‘‘ఈ సందర్భంగా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీకి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. మా నాన్న ఇచ్చిన ఇంటర్వ్యూలన చూశా. అలాంటివి నేనూ విన్నా. ఇప్పటికే పలుమార్లు ‘ఇది సరైంది కాదు’ అని చెప్పా. అందుకే, ఆయన తరఫున నేను వారిద్దరకీ క్షమాపణలు చెబుతున్నా’’ అని యువరాజ్ తెలిపాడు.