
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో జహౌర్ ఇక్బాల్ గ్యాంగ్ రెచ్చిపోయింది. సద్దాం అనే యువకుడిని ఇక్బాల్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చితక బాదారు. విచక్షణా రహితంగా కర్రలతో కొట్టడంతో సద్దామ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని సద్దాంను ఆస్పత్రికి తరలించారు. సిసి ఫుటేజ్ లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 25 మంది ఇక్బాల్ గ్యాంగ్ సభ్యులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.